Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో తమిళ సంస్కృతి... అందులోభాగమే చంద్రబాబుపై వేధింపులు: కొల్లు రవీంద్ర

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు ఇచ్చారని టీడీపీ  పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయ కక్ష తోనే సీఐడీ నోటీసులు ఇచ్చారని టీడీపీ  పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అమరావతి రాజధానిని అల్లరి చేయాలని ఇలా చేస్తున్నారన్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షం లో ఉన్నప్పటి నుంచి ప్రచారం చేస్తున్నారని... జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు 20 నెలలు అవుతుంది మరి ఎందుకు నిరూపించలేదు? అని ప్రశ్నించారు.  విశాఖలో రాజధాని కావాలని వైసీపీ నేతలు అమరావతిపై బురద చల్లుతున్నారన్నారు. ఏపీలో తమిళనాడు సంస్కృతి వస్తుందని... ప్రతిపక్షాల పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. 
అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చాలా పారదర్శకంగా ముందుకు వెళ్లారన్నారు. రాష్ట్రాన్ని అల్లరి చేయడం వల్ల ప్రజల భవిష్యత్ నాశనం అవుతుందని రవీంద్ర హెచ్చరించారు.