గుంటూరు గ్యాంగ్ రేప్... బాధితురాలికి రూ.5లక్షల ఆర్థిక సాయం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొందరు దుండగులు ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద కొందరు దుండగులు ప్రియుడిని కట్టేసి ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఇలా కామాంధుల చేతిలో లైంగిక దాడికి గురయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార భాదితురాలిని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్ ను భాదితురాలి తల్లికి హోంమంత్రి అందించారు. హోం మినిస్టర్ తో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా ఇతర అధికారులు కూడా ఉన్నారు.