సూపర్ స్టార్ కృష్ణ మృతి... సొంతూరు బుర్రిపాలెంలో విషాదం
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మారుమూల గ్రామం బుర్రిపాలెంకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చింది సూపర్ స్టార్ కృష్ణనే.
గుంటూరు : గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మారుమూల గ్రామం బుర్రిపాలెంకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చింది సూపర్ స్టార్ కృష్ణనే. తెలుగు సినీరంగంలో తనదైన నటనతో ఆకట్టుకుని సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ తమవాడే అని చెప్పుకోడానికి బుర్రిపాలెం వాసులు గర్వంగా ఫీలవుతారు. ఇలా తామెంతో అభిమానించే సూపర్ స్టార్ ఆరోగ్యం విషమంగా వుందని తెలిసి ఆందోళనకు గురయిన బుర్రిపాలెం వాసులకు ఇవాళ తెల్లవారుజామున పిడుగులాంటి వార్త వినాల్సివచ్చింది. కృష్ణ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని కృష్ణ ఇంటివద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు సంతాపం తెలుపుతున్నారు.