Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా నదిలో కలిసిన కృష్ణ అస్థికలు... మహేష్ చేతులమీదుగా అంతిమక్రియలు

విజయవాడ : సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంబసభ్యులు కృష్ణానదిలో కలిపారు. 

First Published Nov 21, 2022, 2:48 PM IST | Last Updated Nov 21, 2022, 2:48 PM IST

విజయవాడ : సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు, ఘట్టమనేని కుటుంబసభ్యులు కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్ నుండి  ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేష్ అక్కడినుండి రోడ్డుమార్గంలో కృష్ణా తీరానికి బయలుదేరారు. బారీ బందోబస్తుతో ధర్మ నిలయం ఘాట్ కు చేరుకున్న మహేష్ బాబు తండ్రి అస్థికలను కృష్ణానదిలో కలపారు. మహేష్ వెంట కృష్ణ సోదరుడు శేషగిరిరావు, అల్లుళ్లు గల్లా జయదేవ్, సుధీర్ బాబుతో పాటు ఇతర కుటుంబసభ్యులు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.