Asianet News TeluguAsianet News Telugu

విద్యాశాఖ మంత్రి సురేష్ కు నిరుద్యోగ సెగ... కాన్వాయ్ అడ్డగింత

అనంతపురం: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరుద్యోగ నిరసన సెగ తగిలింది. 

First Published Jul 6, 2021, 6:18 PM IST | Last Updated Jul 6, 2021, 6:18 PM IST

అనంతపురం: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరుద్యోగ నిరసన సెగ తగిలింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని... ఇందుకోసం కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలంటూ అనంతపురం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లాకు విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సురేష్ కాన్వాయ్ ని అడ్డగించారు. ఏఐఎస్ఎఫ్ మనోహర్, ఎస్ఎఫ్ఐ సూర్య చంద్ర, డివైఎఫ్ఐ రమేష్, ఎన్ఎస్ యుఐ పులి రాజు, పిడిఎస్ యు వీరేంద్ర తదితరులు మంత్రి కాన్వాయ్ ని అడ్డుకున్నారు.