AP News:అంబేద్కర్ జయంతి ర్యాలీపై రాళ్లురువ్వి, ఇళ్లపై దాడి... జూపూడిలో ఉద్రిక్తత
అమరావతి: గుంటూరు జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుక ఉద్రిక్తతకు దారితీసింది.
అమరావతి: గుంటూరు జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుక ఉద్రిక్తతకు దారితీసింది. అమరావతి మండలం జూపూడి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే పాతకక్షల నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తున్న వారిపై కొందరు దుండగులు రాళ్లదాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఇళ్లపైకి దాడికి దిగి కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసారు. దీంతో జూపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బలగాలతో జూపూడికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటుచేసారు. ర్యాలీపై రాళ్లు రువ్విన దుండగులను గుర్తించేపనిలో పడ్డారు పోలీసులు.