Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం... పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లిన నిరసనకారులు

విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. 

First Published Nov 9, 2022, 4:24 PM IST | Last Updated Nov 9, 2022, 4:24 PM IST

విశాఖపట్నం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నగరానికి వస్తున్న ప్రధాని నిరసన గళం వినిపించేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు వివిధ కార్మిక సంఘాలు ఇప్పటినుండే నిరసనలు చేపట్టాయి. ఇలా ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. స్టీల్ ప్లాంట్ నుండి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినా కొనసాగించారు కార్మికులు. ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా మొహరించిన పోలీసులు ప్రయత్నించినా వారిని తోసుకుంటూ ముందుకు కదిలారు నిరసనకారులు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగి విశాఖలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది.