Asianet News TeluguAsianet News Telugu

600 రోజులకు విశాఖ ఉక్కు దీక్ష... జివిఎంసి వద్ద నల్లజెండాలతో నిరసన

విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ జీవీఎంసీ వద్ద చేపట్టిన నిరసన దీక్ష 600 రోజులకు చేరుకుంది. 

First Published Nov 22, 2022, 5:02 PM IST | Last Updated Nov 22, 2022, 5:02 PM IST

విశాఖపట్నం : కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ జీవీఎంసీ వద్ద చేపట్టిన నిరసన దీక్ష 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్మిక, ప్రజాసంఘాలు, ప్రభుత్వం రంగసంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిలే నిరసన దీక్షలో  కార్మికులు, వివిధ రాజకీయ పక్షాలు పెద్దఎత్తున నల్ల జెండాలతో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు, పార్టీల నాయకులు డిమాండ్ చేసారు.