Asianet News TeluguAsianet News Telugu

నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ ఐజీ ఆకస్మిక తనిఖీ...

 ఏలూరు : రిజిస్ట్రేషన్ల జాప్యం, అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జాయింట్ ఐజి తిమ్మాపురం సరోజ ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రు. 

First Published Dec 20, 2022, 5:17 PM IST | Last Updated Dec 20, 2022, 5:17 PM IST

 ఏలూరు : రిజిస్ట్రేషన్ల జాప్యం, అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు అందడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జాయింట్ ఐజి తిమ్మాపురం సరోజ ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ కార్యాలయం మొత్తం తిరిగుతూ ఉద్యోగులతో మాట్లాడారు ఐజీ. అలాగే పలు ఫైళ్లను పరిశీలించిన జాయింట్ ఐజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతుందో ఆరా తీసారు. 

ఈ సందర్భంగా జాయింట్ ఐజీ మాట్లాడుతూ... రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత వల్లే రిజిస్ట్రేషన్లు ప్రక్రియలో జాప్యం జరుగుతుందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి త్వరలో సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్న జాయింట్ ఐజి పేర్కొన్నారు. అలాగే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం వల్ల పని భారం తగ్గుతుందని... తద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరం అవుతుందన్న జాయింట్ ఐజి సరోజ పేర్కొన్నారు.