వినుకొండలో దొంగల హల్ చల్...ఖరీదైన స్పోర్ట్స్ బైక్ ఎలా దొంగిలిస్తున్నారో చూడండి (సిసి వీడియో)
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో గురువారం రాత్రి బైక్ దొంగలు హల్ చల్ చేసారు.
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో గురువారం రాత్రి బైక్ దొంగలు హల్ చల్ చేసారు. అర్థరాత్రి ఇంటిముందు నిలిపివుంచిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్ నే టార్గెట్ చేసుకున్నారు దొంగలు. రాత్రి సమయంలో రెక్కీ నిర్వహించి దొంగిలించడానికి అనువుగా వున్న బైక్ లను గుర్తించి అర్థరాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా గత రాత్రి పట్టణంలోని వివేకానంద స్కూల్ సమీపంలో ఓ ఇంటిబయట నిలిపిన కేటీయం బైక్ ను దొంగిలించారు. ఇద్దరు దొంగలు బైక్ హ్యాండిల్ లాక్ ను విరగ్గొట్టి చప్పుడుకాకుండా తోసుకుంటూ వెళుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ సిసి ఫుటేజి ఆధారంగా దొంగలను గుర్తించి వారి ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు వినుకొండ పోలీసులు.