Asianet News TeluguAsianet News Telugu

విశాఖ నుండి కార్గో సేవలు ప్రారంభించిన స్పైస్ జెట్

విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. 

విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చొరవతో రక్షణ శాఖ అనుమతిని ఇచ్చింది. దీంతో ఈనెల 25 నుండి తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్‌ జెట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 15 వ తేదీన మొదలుకావలసిన కార్గో సేవలు రక్షణ శాఖ అభ్యంతరం తెలపడంతో వాయిదా పడింది .