Asianet News TeluguAsianet News Telugu

స్పెషల్ ప్రొటెక్షన్, ట్రాఫిక్ ఆంక్షలు... విశాఖ నుండి గుంటూరుకు ఆక్సిజన్

గుంటూరు: ప్రస్తుతం కరోనా విలయతాండవం కారణంగా నిజంగా ప్రాణవాయువు ఆక్సిజన్ విలువేంటో ఈ మానవజాతికి తెలుస్తోంది. 

గుంటూరు: ప్రస్తుతం కరోనా విలయతాండవం కారణంగా నిజంగా ప్రాణవాయువు ఆక్సిజన్ విలువేంటో ఈ మానవజాతికి తెలుస్తోంది. దీంతో అత్యవసర సర్వీసుల జాబితాలో ఆక్సిజన్ ను తరలించే వాహనాలు కూడా చేరాయి. పోలీసు సెక్యూరిటీ, ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ ఆక్సిజన్ ను తరలించే వాహనాలు సకాలంలో హాస్పిటల్స్ కు చేరుకునేలా చూస్తున్నారు. తాజాగా విశాఖ నుండి గుంటూరుకు ఇదేరకంగా ప్రత్యేక భద్రత మధ్య ఆక్సిజన్ ను తరలించారు. మధ్యలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా స్పెషల్ ప్రోటక్షన్ తో 15 టన్నుల ఆక్సిజన్ గుంటూరుకు చేరుకుంది.