Asianet News TeluguAsianet News Telugu

పార్వతీపురంలో వింత... అమ్మవారి ఆలయంనుండి గజ్జల శబ్దం

పార్వతీపురం మన్యం జిల్లాలో వింత ఘటన వెలుగుచూసింది.

పార్వతీపురం మన్యం జిల్లాలో వింత ఘటన వెలుగుచూసింది. పార్వతీపురం పట్టణంలోని నాయుడు వీధిలోని అమ్మవారి ఆలయంలో గజ్జల శబ్దం వస్తోందంటూ ముమ్మర ప్రచారం జరిగింది. దీంతో ఇది అమ్మవారి గజ్జల శబ్దమేనంటూ నమ్ముతున్న స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ ఆలయంలో నిన్న (సోమవారం) సాయంత్రం అర్చకులు పూజలు ముగించి తాళం వేసి వెళ్లారు. అయితే కొద్దిసేపటి తర్వాత మూసివున్న ఆలయంనుండి గజ్జల శబ్దం వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ వార్త పట్టణమంతా వ్యాపించడంతో ఆలయంవద్దకు భారీగా భక్తులు చేరుకుని గజ్జల శబ్దం వినే ప్రయత్నం చేస్తున్నారు. 

Video Top Stories