మడ్డువలస ప్రాజెక్ట్ నిర్వాసితులతో సోము వీర్రాజు సమావేశం... అండగా వుంటానని హామీ

ఉత్తరాంధ్రలోని రాజాం నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న ''మడ్డువలస రిజర్వాయర్'' నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమావేశమయ్యారు. 

First Published May 24, 2022, 3:29 PM IST | Last Updated May 24, 2022, 3:29 PM IST

ఉత్తరాంధ్రలోని రాజాం నియోజకవర్గ పరిధిలో నిర్మిస్తున్న ''మడ్డువలస రిజర్వాయర్'' నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సమావేశమయ్యారు. వంగర మండలం పట్టువర్ధనం గ్రామంలో మడ్డువలస నిర్వాసితులతో మాట్లాడిన వీర్రాజు వారి కష్టాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులు నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు వైఫల్యమైందని వీర్రాజు పేర్కొన్నారు.మడ్డువలస రిజర్వాయర్ కోసం భూములు, ఇండ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వీర్రాజు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బాధలను కళ్లారా చూసాను... వారికి అండగా పోరాడానని అన్నారు. ఇప్పుడు మడ్డువలస ప్రాజెక్టు బాధితుల సమస్యల పరిష్కారానికే పోరాడతానన్నారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఇసుక, చెరువులో మట్టి అమ్ముకుని సంపాదించుకుంటున్నారే తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని బుద్ధిలేని నాయకత్వం పరిపాలిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం దగ్గర ఇటువంటివి చెల్లవన్నారు. ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లాలో కూడా ప్రాజెక్టు నిర్వాసితులు ఉన్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు.