తప్పిన ప్రమాదం... స్కూల్ బస్సులో పొగలు... పరుగుతీసిన చిన్నారులు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పెను ప్రమాదం తప్పింది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు బస్సులో స్కూల్ కు వెళుతుండగా ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన బస్సులోని స్కూల్ సిబ్బంది 30మంది విద్యార్థులను కిందకుదింపారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. విద్యార్థులను సురక్షితంగా వేరే స్కూల్ బస్సులో పాఠశాలకు తరలించారు.