Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న చందనోత్సవం... ఏర్పాట్లలో అధికారుల విఫలం

సింహాచలంలో అప్పన్న చందనోత్సవం ఘనంగా ప్రారంభమయింది. 

First Published Apr 23, 2023, 9:10 AM IST | Last Updated Apr 23, 2023, 9:10 AM IST

సింహాచలంలో అప్పన్న చందనోత్సవం ఘనంగా ప్రారంభమయింది. నిజరూపంలో అప్పన్నను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున   దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ  పట్టు వస్త్రాలు సమర్పించారు. టిటిడి తరఫున  టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోపక్క కొండపై భక్తులు, వీఐపీలు అష్టకష్టాలు పడుతున్నారు. వీఐపీ క్యూ లైన్లు కూడా నిలిచిపోవడంతో న్యాయమూర్తులు, మేయర్లు సహా పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క సింహాచలం కొండపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు బస్సులు దిగి ఘాట్ రోడ్ల పై నడిచి వెళ్లారు.