విద్యార్థులు, తల్లిదండ్రులతో ఎస్ఎఫ్ఐ ధర్నా... సర్పంచ్ అడ్డుకోవడంతో ఉద్రిక్తత

విజయవాడ : విద్యార్థుల సమస్యలపై స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది.

First Published Aug 26, 2022, 12:37 PM IST | Last Updated Aug 26, 2022, 12:37 PM IST

విజయవాడ : విద్యార్థుల సమస్యలపై స్టూడెంట్స్ యూనియన్ ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. నందిగామ పరిధిలోని వీరులపాడు మండలం చౌటపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. అయితే పాఠశాల ప్రాంగణంలో ధర్నా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామ సర్పంచ్ వీరితో వాగ్వాదానికి దిగారు. ధర్నాను అడ్డుకుని స్కూల్ గేటు బయట చేసుకోవాలని సర్పంచ్ ఆదేశించారు. సర్పంచ్ తీరుపు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలు చదువుకునే స్కూళ్లో సమస్యలపై ఆందోళన చేస్తుంటే దీన్ని రాజకీయం చేయాలని సర్పంచ్ చూస్తున్నారని ఆరోపించారు. అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే సిద్దంగా వున్నారని... వెంటనే ఆందోళన విరమించాలని సర్పంచ్ కోరారు. అందుకు విముఖత వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే ఇక్కడికే వచ్చి తమ సమస్యలు వినాలంటూ కోరుతున్నారు.