కరోనా టెస్టుల్లో అవకతవకలు.. పాజిటివ్ లను నెగెటివ్ అని ఇంటికి పంపుతున్న సిబ్బంది..
విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన సురేంద్రకుమార్ లారీ డ్రైవర్.
విజయవాడ రామలింగేశ్వర నగర్ కు చెందిన సురేంద్రకుమార్ లారీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లొచ్చాక కరోనా లక్షణాలు అనిపించి స్వచ్ఛందంగా విజయవాడ హాస్పిటల్ వెళ్లాడు. రెండుసార్లు స్వాప్ టెస్ట్ చేసి, పదిరోజులు ఉంచుకుని నెగెటివ్ అని ఇంటికి పంపించారు. కానీ పంపిన నెక్ట్స్ డేనే కరోనా పాజిటివ్ అని చెప్పి హాస్పిటల్ కి తీసుకువచ్చారు. దీంతో కుటుంబం కూడా ఎఫెక్ట్ అయ్యిందని ఆవేదన చెందుతూ.. ఇక ముందు ఇలా జరగొద్దని వీడియో షేర్ చేశాడు..