లాక్ డౌన్ ఉల్లంఘన : చేతిలో ప్లకార్డులతో రోడ్లమీద.. పోలీసుల కొత్త శిక్షలు...
విశాఖపట్నం, గోపాలపట్నం పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో లో అవగాహన కల్పించారు.
విశాఖపట్నం, గోపాలపట్నం పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో లో అవగాహన కల్పించారు. టు వీలర్ పై హెల్మెట్ లేకుండా, ఇద్దరిద్దరు ప్రయాణం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయకుండా వారికి ట్రాఫిక్, కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా వారి చేతికి ప్లకార్డులు ఇచ్చి.. గంటపాటు రోడ్డ మీద నిలబెడుతున్నారు. మిగతా వాహనదారులకు అవగాహన కల్పించేలా చేస్తున్నారు. గోపాలపట్నం ట్రాఫిక్ ఎస్ఐ వెంకట్రావు మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో కొంత మంది ఇప్పటికీ బయటకు రావడం చాలా బాధ కలిగిస్తుందని ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం ఒకటే మార్గమని, విశాఖపట్నంలో మూడు ప్రాంతాలలో రెడ్ జోన్లు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వం చెబుతున్న సూచనలు, సలహాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.