అనకాపల్లిలో గల్లంతైన విద్యార్థుల కోసం హెలికాప్టర్, కోస్ట్‌గార్డ్ నౌకలతో సెర్చ్ ఆపరేషన్
అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన సంగతి తెలిసిందే.
అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన విద్యార్ధుల కోసం శుక్రవారం సాయంత్రం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లైంతనవారిలో మరో రెండు మృతదేహాలను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది. మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ గుర్తించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.అనకాపల్లి డైట్ కాలేజ్‌కు చెందిన 12 మంది విద్యార్థులు శుక్రవారం పూడిమడక తీరానికి వచ్చారు. వీరిలో 11 మంది సముద్రం నీటిలో సరదాగా గడిపేందుకు దిగారు. అయితే బలమైన ప్రవాహానికి ఏడుగురు కొట్టుకుపోయారు. సముద్రంలోకి వెళ్లని విద్యార్థి వెంటనే స్థానిక మత్స్యకారులను అప్రమత్తం చేశారు. దీంతో స్థానిక మత్స్యకారులు మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ అనే వ్యక్తిని రక్షించారు. మరో విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. విద్యార్థుల గాలింపు కోసం రెండు నేవీ హెలికాప్టర్, నాలుగు బోట్లతో కోస్టు గార్డులు, మెరైన్ పోలీసులు సముద్ర తీరంలో గాలిస్తున్నారు. స్థానిక మత్స్యకారులు కూడా వీరికి సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నీటిపై తేలియాడుతున్న మృతదేహాలను ఓడ్డుకు చేర్చారు. ఆ మృతదేహాలను గణేష్, జగదీష్‌లవిగా గుర్తించారు. మరో ముగ్గురు విద్యార్థులు జశ్వంత్, రామచంద్, సతీష్‌ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.