తమ పిల్లలను కరోనా నుండి రక్షించాలంటూ... తల్లిదండ్రుల ఆందోళన

అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండలో తమ పిల్లలు చదువుతున్న స్కూల్ కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 

First Published Feb 3, 2021, 12:04 PM IST | Last Updated Feb 3, 2021, 12:04 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండలో తమ పిల్లలు చదువుతున్న స్కూల్ కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. కరోనా టైంలో నిబంధనలు పాటించకుండా ఒకే బస్సులో 100 మంది పిల్లలని ఎక్కించి తరలిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఆక్స్ఫోడ్ స్కూల్ బస్సుని విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ తమ పిల్లలకు భద్రత కల్పించడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  స్కూల్ బస్సుని అడ్డుకుని విద్యార్థులను దింపివేశారు. పరిమిత సంఖ్యలో విద్యార్థులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చెయ్యాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.