Asianet News TeluguAsianet News Telugu

ప్రిన్సిపాల్ మందలించాడని... 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

గుంటూరు: ప్రిన్సిపాల్ మందలించాడని మనస్థాపానికి గురయిన ఓ విద్యార్థి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. 

First Published Jan 28, 2021, 12:58 PM IST | Last Updated Jan 28, 2021, 12:58 PM IST

గుంటూరు: ప్రిన్సిపాల్ మందలించాడని మనస్థాపానికి గురయిన ఓ విద్యార్థి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. అందరిముందు మందలించడంతో తన పరువు పోయిందని భావించిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా 9వ తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. యూనిఫామ్ లేకుండా వచ్చాడని గ్రీన్ లాండ్ స్కూల్ ప్రిన్సిపాల్ సాంబశివరావు అనే విద్యార్థిని మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన బాలుడు ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. ప్రిన్సిపాల్ మందలించడంతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతొ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పట్టాబిపురం పోలీసులు.