Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో ఘోరం... 30 మంది చిన్నారులతో వెళుతున్న స్కూల్ బస్ యాక్సిడెంట్

అవనిగడ్డ : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురయి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. 

First Published Sep 25, 2022, 11:25 AM IST | Last Updated Sep 25, 2022, 11:25 AM IST

అవనిగడ్డ : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురయి ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. చల్లపల్లి  మండలం రామానగరంలోని చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులతో లక్ష్మీపురం వెళుతుండగా ప్రమాదం జరిగింది. గ్రామ శివారులో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో వున్న 30మంది విద్యార్థుల్లో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు ఓ చెట్టును డీకొని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది.