Asianet News TeluguAsianet News Telugu

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం... చిత్తూరులో స్కూల్ బస్సు యాక్సిడెంట్

చిత్తూరు : విద్యార్థులను స్కూల్ కు తీసుకువెళుతుండగా బస్సు అదుపుతప్పిన ప్రమాదానికి గురయ్యింది.

First Published Aug 7, 2023, 7:25 PM IST | Last Updated Aug 7, 2023, 7:25 PM IST

చిత్తూరు : విద్యార్థులను స్కూల్ కు తీసుకువెళుతుండగా బస్సు అదుపుతప్పిన ప్రమాదానికి గురయ్యింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బోడబండ్ల గ్రామానికి చెందిన విద్యార్థులను తీసుకువెళుతుండగా అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే అదృష్టం బావుండి బోల్తాపడుతుందనగా ఓ కొబ్బరిచెట్టుకు ఒరిగి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని విద్యార్థులంతా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 

డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.  నెల రోజులుగా బ్రేకులు లేకున్నా బస్సును అలాగే నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడారు. బస్సు కండిషన్ గురించి స్కూల్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోలేదని డ్రైవర్ చెబుతున్నాడు. బస్సు డ్రైవర్, స్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.