Asianet News TeluguAsianet News Telugu

స్కూల్ బస్సును ఢీకొన్న లారీ... 60 మంది చిన్నారులకు తప్పిన ప్రమాదం

అనకాపల్లి జిల్లాలో పెనుప్రమాదం తప్పంది. 60 మంది చిన్నారులతో హైవేపై వెళుతున్న స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చి లారీ ఢీకొట్టింది. 

First Published Nov 25, 2022, 10:36 AM IST | Last Updated Nov 25, 2022, 10:36 AM IST

అనకాపల్లి జిల్లాలో పెనుప్రమాదం తప్పంది. 60 మంది చిన్నారులతో హైవేపై వెళుతున్న స్కూల్ బస్సును వేగంగా దూసుకొచ్చి లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. అయితే బస్సును ఢీకొట్టిన తర్వాత లారీ ఆగడంతో పెనుప్రమాదం తప్పింది. లారీ ఢీకొట్టగానే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. బస్ యాక్సిడెంట్ గురించి తెలిసి చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనతో ఘటనాస్థలికి చేరుకున్నారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న వైద్యసిబ్బంది చిన్నచిన్న గాయాలైన విద్యార్థులకు ఘటనాస్థలిలోనే ప్రథమిచికిత్స చేసారు. మరికొందరు విద్యార్థులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. లారీ బ్రేక్ ఫెయిల్ కావడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.