లాక్ డౌన్ విషాదం : మందులకోసం వెడితే కొట్టి చంపారు..

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఓ యువకుడు మరణించిన విషాదఘటన చోటుచేసుకుంది.

First Published Apr 20, 2020, 11:47 AM IST | Last Updated Apr 20, 2020, 11:49 AM IST

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక ఓ యువకుడు మరణించిన విషాదఘటన చోటుచేసుకుంది. హార్ట్ పేషంటైన మహ్మద్ గౌస్ మందులకోసం సత్తెనపల్లిలోని మెడికల్ షాపుకు వచ్చాడు. సత్తెనపల్లిలోని చెక్ పోస్టు వద్ద ఆపిన పోలీసులు అతన్ని చితకబాదడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం హాస్పిటల్ లో చేర్చిన కాసేపటికి మృతి చెందాడు. దీంతో బంధువులు శవంతో పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.