యువకుడిని కొట్టిన ఎస్ఐ పై తక్షణ చర్య : అంబటి రాంబాబు
సత్తెనపల్లిలో సోమవారం ఉదయం జరిగిన ఘటనపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా వుండే సత్తెనపల్లిలో పోలీస్ దెబ్బల కారణంగా ఒకరు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు.
సత్తెనపల్లిలో సోమవారం ఉదయం జరిగిన ఘటనపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎంతో ప్రశాంతంగా వుండే సత్తెనపల్లిలో పోలీస్ దెబ్బల కారణంగా ఒకరు చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. మాన్ హ్యాండ్లింగ్ చేసిన ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీతో మాట్లాడటం జరిగిందని అంబటి తెలిపారు. చనిపోయిన గౌస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని ఆయన తెలిపారు.