Video news: పొలాలు లెవ్వు, ఇసుక లేదు..ఇప్పుడు పారిశుద్ధ్యం పనులు కూడా లేవు..ఎలా బతకాలి
మంగళగిరి మండలం ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించారు.
మంగళగిరి మండలం ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజధాని సిపిఎం నాయకులు ఎం రవి హాజరయ్యారు. కార్మికులకు రెండు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, పెండింగ్లో ఉన్న ఐదు నెలల పిఎఫ్ ను జమ చేయాలని, కార్మికుల నుంచి ఈఎస్ఐ కార్డులకు డబ్బులు కట్ చేస్తూ ఏడాది గడుస్తున్నాకార్డులు ఇవ్వలేదని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని, కాంట్రాక్ట్ సంస్థ అయిన ఎస్.కె ఎంటర్ప్రైజెస్ పై కూడా చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు.