Asianet News TeluguAsianet News Telugu

అంతు చూస్తామంటూ రెవెన్యూ సిబ్బందికి బెదిరిస్తూ... గన్నవరంలో రెచ్చిపోయిన మట్టి మాఫియా

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

First Published Jun 2, 2022, 4:44 PM IST | Last Updated Jun 2, 2022, 4:44 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమంగా మట్టితవ్వకాలు చేపట్టడమే కాదు అడ్డుకోడానికి వెళ్లిన రెవిన్యూ అధికారులను మీ అంతు చూస్తామంటూ  బెదిరిస్తున్నారంటే మట్టి మాఫియా సభ్యులు ఎంతలా బరితెగించారో అర్థమవుతుంది. అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గన్నవరం వీఆర్వో, అర్ఐ అడ్డుకునేందుకు వెళితే మీరెవరు ఆపడానికి అంటూ ఎదురుతిరిగారు.