అల్లూరి జిల్లాలో తప్పిన పెనుప్రమాదం... గోదావరిలోకి దూసుకెళ్ళిన లారీ
దేవీపట్నం: ఇసుక రవాణా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా గోదావరిలోకి దూసుకెళ్ళిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
దేవీపట్నం: ఇసుక రవాణా లారీ అదుపుతప్పి ఒక్కసారిగా గోదావరిలోకి దూసుకెళ్ళిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇసుకరవాణా చేస్తున్న లారీ తెల్లవారుజామున అంగులూరు పాత టూరిజం రేవు సమీపంలో ఇలా ప్రమాదానికి గురయ్యింది. లారీ డ్రైవర్, క్లీనర్ ప్రమాదాన్ని గుర్తించి అప్రమత్తం అవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. లారీ మునక విషయం తెలిసిన వెంటనే పోలీవరం ప్రాజెక్ట్ నిర్మాణ అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, భారీ క్రేన్ సాయంతో లారీని వెలికితీసారు.