Asianet News TeluguAsianet News Telugu

కంచికచర్ల బైపాస్ పై రెండు లారీలు ఢీ... క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్

 
విజయవాడ: కంచికచర్ల బైపాస్ లో రోడ్డులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

 
విజయవాడ: కంచికచర్ల బైపాస్ లో రోడ్డులో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనక నుండి మరోలారీ ఢీకొట్టింది. దీంతో వెనక లారీ క్యాబిన్లో డ్రైవర్ చిక్కుకుపోయాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. హైవే క్రేన్ సహాయంతో డ్రైవర్ని సురక్షితంగా బయటకు తీశారు.  ఎటువంటి గాయాలు కాకుండానే డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.