Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ ను కూల్చేందుకూ బిజెపి కుట్రలు... కేసీఆర్ కామెంట్స్ పై సజ్జల రియాక్షన్

విజయవాడ : తెలంగాణ ప్రభుత్వాన్నే కాదు పక్కనేవున్న మరో తెలుగురాష్ట్రంలోని జగన్ సర్కార్ ను కూడా కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

First Published Nov 17, 2022, 4:28 PM IST | Last Updated Nov 17, 2022, 4:28 PM IST

విజయవాడ : తెలంగాణ ప్రభుత్వాన్నే కాదు పక్కనేవున్న మరో తెలుగురాష్ట్రంలోని జగన్ సర్కార్ ను కూడా కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తోందన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలా మాట్లాడివుంటారని... వాళ్ళ రాజకీయాలతో ఏపీకి సంబంధం లేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల గురించి పట్టవని... వారి ట్రాప్ లో పడబోమన్నారు. వైసిపి ది అభివృద్ది ఎజెండా... జగన్ కూడా అదే అలోచిస్తున్నారని సజ్జల అన్నారు. ఇక చంద్రబాబు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివంటూ సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. 2014లో ప్రజలు చంద్రబాబుకు చివరి అవకాశం ఇచ్చారని... 2019లోనే ఆయనకు చివరి ఎన్నికలు అయిపోయాయన్నారు. ప్రజలు ఆయనను రిజెక్ట్ చేసినా ఇంకా దింపుడుకళ్లం ఆశలున్నాయని... 2023 లోనూ ఆయనకు పరాభవం తప్పదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.