ఈ టన్నెల్స్ తో కరోనాకు చెక్.. డీజీపీ సవాంగ్...
కరోనావైరస్ మహమ్మారిని నివారించడానికి రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో ఎస్ 3 వి సేఫ్టీ టన్నెల్స్ ను ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
కరోనావైరస్ మహమ్మారిని నివారించడానికి రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో ఎస్ 3 వి సేఫ్టీ టన్నెల్స్ ను ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇటీవల డిజిపి గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కోవిడ్ -19 నివారణ చర్యలపై దృష్టి సారించారు. సూక్ష్మజీవుల నివారణ వ్యవస్థ అయిన ఎస్ 3 వి సేఫ్ టన్నెల్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. టన్నెల్ లో ప్రవేశించిన వ్యక్తిపై సోడియం హైపోక్లోరైట్ , మరికొన్ని రసాయనాలు స్ప్రే అవుతాయి.