భారత రాజ్యాంగం శక్తిని, విలువను తెలియజేసేందుకే రన్ ఫర్ అంబేద్కర్

విశాఖపట్నం : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరిగింది.

First Published Nov 26, 2022, 2:52 PM IST | Last Updated Nov 26, 2022, 2:52 PM IST

విశాఖపట్నం : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం జరిగింది. భీమ్ సేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు రవి సిద్ధార్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరుగు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెక్రటరీ విజయ్ కుమార్, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, స్నేహ క్లబ్ నేషనల్ ప్రెసిడెంట్ పి ఎం రాజు ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి పెద్ద ఎత్తున అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుండి ప్రారంభమైన పరుగు కార్యక్రమాన్ని విజయకుమార్ ప్రారంభించారు. 

ప్రపంచంలోనే ఉత్తమమైన రాజ్యాంగం భారతదేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించారని విజయకుమార్ తెలియజేశారు. భారత రాజ్యాంగం శక్తిని, విలువలను తెలియజేసేందుకే రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని భీమ్ సేన వ్యవస్థాపకుడు రవి సిద్ధార్థ తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పీఎం రాజు అన్నారు.