కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం... 31మందితో వెళుతున్న ఆర్టిసి బస్సు, లారీ ఢీ
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు - టిప్పర్ లారీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నప్పటికీ ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సు - టిప్పర్ లారీ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నప్పటికీ ఇరు వాహనాల డ్రైవర్లతో పాటు ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది. టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 31మంది ప్రయాణికులుండగా వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా సమీపంలోని మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. టిప్పర్ ను ఢీకొన్న బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన నీటికాలువలోకి దూసుకెళ్ళింది. ప్రమాదతీవ్రత ఎక్కువగానే వున్నా బస్సులోని ప్రయాణిలంతా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బస్సులోని ప్రయాణికులను కాలువలోంచి బయటకుతీసారు. వెంటనే 108 అంబెలెన్స్ లో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించి అందించారు. టిప్పర్ డ్రైవర్ గోపి ఒక్కడికే తలకు తీవ్రంగా గాయమయ్యింది.