విభజన హామీలు అమలుకాకపోడానికి కారకులెవరు..?: మంగళగిరిలో రౌండ్ టేబుల్ సమావేశం
గుంటూరు : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని విభజన హామీల సాధనకోసం ఏర్పడిన నాన్ పోలిటికల్ జేఏసి పేర్కొంది.
గుంటూరు : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని విభజన హామీల సాధనకోసం ఏర్పడిన నాన్ పోలిటికల్ జేఏసి పేర్కొంది. ఈ జేఏసీ ఆద్వర్యంలో ఏపీకి చెందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో గుంటూరు జిల్లా మంగళగిరి ఐబీఎన్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార వైసిపి మినహా ప్రతిపక్ష పార్టీల (టీడీపీ, బిజెపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన) నేతలు, పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు అప్పికట్ల శ్రీహరినాయుడు మాట్లాడుతూ... విభజన హామీల అమలుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన హామీలను విస్మరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్ని ఏకతాటిపైకి వచ్చి విభజన హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని శ్రీహరి నాయుడు సూచించారు.