హనుమాన్ జంక్షన్ ప్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం... లారీ గాల్లో ఎలా వేలాడుతుందో చూడండి...
గన్నవరం : మంగళవారం రాత్రి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
గన్నవరం : మంగళవారం రాత్రి కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమాన్ జంక్షన్ నుండి నూజివీడు వెళుతున్న లారీ, నూజివీడు నుండి ఏలూరు వెళుతున్న ఆర్టీసి బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. హనుమాన్ జంక్షన్ ప్లైఓవర్ పై బస్సు ఢీకొన్న తర్వాత లారీ అమాంతం రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జిపైకి దూసుకెళ్లింది. దీంతో లారీ రెయిలింగ్ పై ప్రమాదకరంగా గాల్లో వేలాడుతూ వుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో హనుమాన్ జంక్షన్ -నూజివీడు మార్గంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. లారీ డ్రైవర్ మద్యంమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.