ఘోరం.. లారీ చక్రాల కింద పడి మహిళ మృతి..
విశాఖపట్నంలో టూవీలర్ ను లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది.
విశాఖపట్నంలో టూవీలర్ ను లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఎన్ .ఏడీ కూడలి NSTL ఎదురుగా బిర్లా నుండి NAD వైపు తౌడు లోడుతో వెళ్తున్న తారస్ లారీ.. ముందు వెడుతున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా డీ కొట్టింది. దీంతో భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అప్పల నర్సమ్మ (23) పై నుండి లారీ దుసుకుపోయి, అక్కడికక్కడే మృతి చెందింది.