తాడేపల్లి: సీతానగరం హాస్పిటల్ ముందే రోడ్డుప్రమాదం
అమరావతి: తాడేపల్లి సీతానగరంల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అమరావతి: తాడేపల్లి సీతానగరంల ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంసమవగా ట్రాక్టర్ తిరగబడింది. ప్రమాదం అత్యంత ఘోరంగా జరిగినా ఎలాంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదు. కేవలం రెండు వాహనాలు మాత్రమే ధ్వంసమయ్యాయి. మైలవరం నుంచి ఇటుక లోడుతో వచ్చిన ట్రాక్టర్ ఎర్రబాలెంలో అన్ లోడ్ చేసి తిరిగి వెళుతుండగా సీతానగరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలన ఈ ప్రమాదం జరిగిందని ట్రాక్టర్ డ్రైవర్ ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.