ఉద్యోగాల భర్తీ డిమాండ్.. అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత...

అమరావతి :  2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. 

First Published Sep 15, 2022, 10:53 AM IST | Last Updated Sep 15, 2022, 10:53 AM IST

అమరావతి :  2.30 లక్షల ఉద్యోగాల భర్తీ డిమాండ్ చేస్తూ తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో అసెంబ్లీ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, టీఎస్‍ఎస్‍ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‍గోపాల్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఇతర నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, తెలుగు యువత శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు తెలుగు యువత శ్రేణుల్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేశారు. ఈ ఘర్షణలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలుగు యువత నాయకుల్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.