Asianet News TeluguAsianet News Telugu

అమరావతిలో రాజధాని ఉండాలనే కోరిక ఆ ప్రాంత రైతులది మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలందరిది.. అనగాని సత్య ప్రసాద్

బాపట్ల : అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. 

First Published Sep 17, 2022, 1:41 PM IST | Last Updated Sep 17, 2022, 1:41 PM IST

బాపట్ల : అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. అమరావతిలో రాజధాని ఉండాలనే కోరిక అమరావతి ప్రాంత రైతులది మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలందరిది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అర్ధరాత్రి సమయంలో బ్యానర్లు కట్టటం సిగ్గుచేటు. వైసీపీ నాయకులకు దమ్ముంటే ఉదయం పూట బ్యానర్లు కడితే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు.ఈ ప్రాంతం నుండి రాజధాని తరలిపోతుంటే ఈ ప్రాంత వాసిగా మద్దతు తెలపకుండా వ్యతిరేకంగా బ్యానర్లు కట్టడం వైసిపి నాయకుడికే చెల్లింది. వైసీపీ నాయకులకు రాజకీయాల పట్ల అవగాహన మాత్రమే ఉంది. రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. ప్రజలను మభ్య పెట్టేందుకే మూడు రాజధానుల అంశం. న్యాయబద్ధంగా ఇది సాధ్యం కాదు అన్నారు.