పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో రికార్డింగ్ డాన్సులు..! వివాదాస్పదంగా పోలీసులు తీరు..!!
కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గూడూరు గ్రామంలో విజయదశమిని పురస్కరించుకొని ఊరేగింపులతో రికార్డింగ్ డాన్స్ లతో మారు మోగాయి.
కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గూడూరు గ్రామంలో విజయదశమిని పురస్కరించుకొని ఊరేగింపులతో రికార్డింగ్ డాన్స్ లతో మారు మోగాయి. ఇది సాక్షాత్తు గూడూరు పోలీస్ స్టేషన్ ప్రక్కనే జరిగింది. ట్రాక్టర్లపై రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాగూడూరు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు. మైకులకు, ఊరేగింపులకు, చలానాలు కట్టకుండానే రచ్చ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. మైక్, ఊరేగింపుకు అనుమతులు ఉన్నాయా లేవా, అనుమతులు లేని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో రికార్డింగ్ డాన్సులు జరుగుతుంటే స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గూడూరు మండల ప్రజలు కోరుతున్నారు.