కరోనా పాజిటివ్ అనుమానం.. రాయపూడిలో రహదారుల దిగ్బంధనం...
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాల్లో ఆందోళన ఎక్కువవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామాల్లో ఆందోళన ఎక్కువవుతోంది. విజయవాడలో కరోనా విజృంభణ, గవర్నర్ కార్యాలయంలో నలుగురు సిబ్బందికి కరోనావైరస్ సోకడం లాంటివాటితో అప్రమత్తమైన తుళ్లూరు, రాయపూడి గ్రామస్థులు తమ గ్రామాల్లోకి ఎవ్వరూ రాకుండా రాకపోకలు నిషేధించారు. ముళ్లకంచెలు వేసి రహదారులను దిగ్భంధనం చేశారు.