కోవిద్19 : రాష్ట్రాల స్థితిగతులపై గవర్నర్లతో రాష్ట్రపతి టెలీకాన్ఫరెన్స్..

కరోనా వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 

First Published Apr 3, 2020, 1:59 PM IST | Last Updated Apr 3, 2020, 1:59 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రత్యేకించి నిరుపేదలకు నిత్యావసర వస్తు పంపిణీ పరంగా స్పష్టమైన కార్యాచరణతో ముందడుగు వేస్తున్నారని గౌరవ గవర్నర్ వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో కరోనా స్ధితి గతుల మీద రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయిడు ఢిల్లీ నుండి అయా రాష్ట్రాల గవర్నర్ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.