దుగ్గిరాలలో మరో దారుణం... గుడిలో నిద్రిస్తున్న మహిళా కూలీపై యువకుల అత్యాచారయత్నం

గుంటూరు: కోరిక తీర్చలేదని వివాహితనుఅతి కిరాతకంగా హతమార్చిన దారుణం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో చోటుచేసుకుంది.

First Published Apr 29, 2022, 11:49 AM IST | Last Updated Apr 29, 2022, 11:49 AM IST

గుంటూరు: కోరిక తీర్చలేదని వివాహితనుఅతి కిరాతకంగా హతమార్చిన దారుణం దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో చోటుచేసుకుంది. ఇది జరిగిన 24గంటల్లోనే మరో దారుణం వెలుగుచూసింది. కూలీపనుల కోసం విశాఖపట్నం జిల్లా నుండి ఇదే దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామానికి వచ్చిన మహిళపై కొందరు యువకులు అత్యాచారయత్నం చేసారు. తోటి కూలీలతో కలిసి గుడిలో నిద్రిస్తున్న మహిళను బలవతంగా పొలాల్లోకి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి యత్నించగా ఆమె గట్టిగా అరవడంతో భయపడిపోయిన యువకులు అక్కడినుండి పరారయ్యారు. ముగ్గురు యువకులు తనను ఎత్తుకెళ్లినట్లు బాధిత మహిళ వెల్లడించింది.  

బాధిత మహిళలతో పాటు తోటి కూలీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకులు విడిచివెళ్లిన బైక్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని ఆధారంగా అఘాయిత్యానికి యత్నించిన యువకులను గుర్తించారు. వారు ప్రస్తుతం పరారీలో వుండటంతో గాలిస్తున్నారు.