రమ్య హత్య కేసు... ఆ పోలీసులకు అవార్డులు వచ్చేలా చూస్తాం: జాతీయ ఎస్సీ కమీషన్

గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ఓ ప్రేమోన్మాది దళిత యువతి రమ్యపై అతి కిరాతకంగా కత్తితో దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే.

First Published Aug 25, 2021, 1:33 PM IST | Last Updated Aug 25, 2021, 1:33 PM IST

గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ఓ ప్రేమోన్మాది దళిత యువతి రమ్యపై అతి కిరాతకంగా కత్తితో దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య తర్వాత పోలీసులు స్పందించిన తీరు అద్భుతమని మంగళవారం ఏపీకి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్పీలు అరిఫ్ హాఫిజ్, విశాల్  గున్నీతో  పాటు రమ్య హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులకు అవార్డులు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిపార్సు చేస్తామని కమీషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దార్ తెలిపారు. వెంటనే నిందితుడి అరెస్ట్, అతనిపై తక్కువ వ్యవదిలో చార్జ్ షీట్ వేయడం వంటి పోలీస్ చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని జాతీయ ఎస్సీ కమీషన్ అభిప్రాయపడింది.