Asianet News TeluguAsianet News Telugu

భక్తులతో పాటు.. తిరుమల చేరుకున్న వరుణుడు.. కొండపైన కుండపోత...

తిరుమలలో 83 రోజుల విరామం తరువాత ఈ రోజునుండి సామాన్యభక్తులకు అనుమతించడంతో సందడి నెలకొంది.

తిరుమలలో 83 రోజుల విరామం తరువాత ఈ రోజునుండి సామాన్యభక్తులకు అనుమతించడంతో సందడి నెలకొంది. దీంతోపాటు నైరుతి రుతుపవనాల కారణంగా వరుణుడూ సందడి చేస్తున్నాడు. ఆలయ ఉద్యోగులతో రెండు రోజులపాటు టీటీడీ నిర్వహించిన ట్రయల్‌ రన్ విజయవంతం కావడంతో ఒకరోజు ముందే అంటే బుధవారం నుంచే టికెట్లు జారీ చేశారు. తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 18 కౌంటర్లలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది టీటీడీ. విష్ణు నివాసం వద్ద 8 కౌంటర్లు, శ్రీనివాసం దగ్గర 6 కౌంటర్లు, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఒక రోజు ముందుగానే తిరుపతిలో దర్శనం టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా పూర్తయిందని, ఆన్‌లైన్‌లో 60 వేల టికెట్లను 30 గంటల్లో భక్తులు కొనుగోలు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Video Top Stories