Asianet News TeluguAsianet News Telugu

స్మగ్లర్లూ తగ్గట్లేదుగా... పుష్ఫ సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్

పాడేరు : 'పుష్ఫ' సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సన్నివేషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సే

First Published Nov 28, 2022, 1:52 PM IST | Last Updated Nov 28, 2022, 1:52 PM IST

పాడేరు : 'పుష్ఫ' సినిమాలో హీరో అల్లు అర్జున్ పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సన్నివేషాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సేమ్ టు సేమ్ ఇలాగే పుష్ఫరాజ్ స్టైల్లోనే గంజాయి స్మగ్లింగ్ కు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కొందరు కేటుగాళ్లు. బొలేరో వెహికిల్ టాప్ పై ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా ఓ అరను ఏర్పాటుచేసుకుని అందులో గంజాయి పెట్టి తరలించసాగారు స్మగ్లర్లు. అయితే డుంబ్రిగూడ  మండలం కించుమండలో వాహనాల తనిఖీ చేస్తుండగా పోలీసులకు ఈ వాహనం పట్టుబడింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరి మాటలు అనుమానాస్పదంగా వుండటంతో ఎస్ఈబి అధికారులు జాగ్రత్తగా పరిశీలించగా గంజాయి స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. గంజాయి స్మగ్లింగ్ కోసమే వాహనంలో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాట్లను చూసి అధికారులే ఆశ్చర్చపోయారు. ఇందులో తరలిస్తున్న 130 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని రమేష్, మహేశ్వర్ ను అరెస్ట్ చేసారు.