Asianet News TeluguAsianet News Telugu

సక్సెస్: నింగిలోకి ఉపగ్రహాలతోపాటు మోడీ ఫోటో, భగవద్గీత

పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ను ఆదివారం నాడు ఉదయం 10.24 నిముషాలకు శ్రీహారికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. 

First Published Feb 28, 2021, 2:36 PM IST | Last Updated Feb 28, 2021, 2:36 PM IST

పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ను ఆదివారం నాడు ఉదయం 10.24 నిముషాలకు శ్రీహారికోటలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. పీఎస్ఎల్‌వీ సీరిస్ లో ఇది 53వ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెప్పారు. పీఎస్ఎల్‌వీ సీ-51 రాకెట్ ద్వారా 19 ఉపగ్రహాలను నింగిలోకి ఇస్రో ఇవాళ పంపింది.దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉప గ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను ఇవాళ ప్రయోగించారు. బ్రెజిల్ కు చెందిన ప్రధాన ఉప గ్రహాంతో పాటు 18 శాటిలైట్స్ ను కక్ష్యలోకి పంపారు. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో తొలి ప్రయోగం నిర్వహిస్తున్నారు. విద్యార్దులు రూపొందించిన సతీష్ థవన్ శాట్-1, జిట్ శాట్, శ్రీశక్తిశాట్, జీహెచ్ఆర్‌సీ శాట్, సింధు నేత్ర సహా శాటిలైట్లను ప్రయోగించారు. అంతే కాకుండా అంతరిక్షంలోకి తొలిసారి భగవద్గీతను, మోదీ ఫోటోలను పంపారు.