సిపిఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరసన.. అప్రమత్తమైన పోలీసులు..
ఎన్టీఆర్ జిల్లా : సిపిఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా : సిపిఎస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన చేపట్టారు. దీంతో నందిగామ బైపాస్ వై జంక్షన్ వద్ద సిఐ కనకారావు వాహనాల తనిఖీలు చేపట్టారు. పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఈ నిరసన లో భాగంగా ముందుగా అనుకున్నట్టు సీఎం ఇంటి ముట్టడి పిలుపును ఉద్యోగ సంఘాలు విరమించుకున్నాయి. జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. కానీ సిపిఎస్ కు వ్యతిరేకముగా ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఆందోళనలకు అనుమతులు లేవని సిఐ కనకరావు తెలిపారు.